
వందశాతం రుణ లక్ష్యం సాధించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సకాలంలో రుణాలు అందజేసి వందశాతం లక్ష్యం సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో రైతులకు పంట రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజి రుణం, మహిళా శక్తి యూనిట్లకు రుణం, ఇతర అంశాలపై డీసీసీడీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2024–25 సంవత్సరానికి సెప్టెంబర్ చివరి నాటికి 45.78 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురి అవుతున్నాయని, వీటిని పరిష్కరించి రుణం మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా శక్తి కార్యక్రమం కింద బ్యాంక్ రుణం, బ్యాంక్ లీకేజి ద్వారా విరివిగా రుణ సహాయం అందించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పెండింగ్ యూనిట్లకు రుణ సహాయం అందించాలన్నారు. నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల రుణం కింద రూ.63 కోట్లకు రూ.56 కోట్ల రుణం అందించినట్లు తెలిపారు. ఇంటర్ నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో బ్యాంకులకు ప్రతిపాదనలు పంపిస్తే వీశాట్ పరికరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డెయిరీ సహకార సంఘాలు డీసీసీబీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్‌బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ అధికారి పృథ్వీ, ఎల్‌డీపీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో 100 మోడల్ సీఎస్‌సీఐసీటీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మహిళ శక్తి కింద జిల్లాలో 25 మంది మహిళ పొదుపు సంఘం మహిళలను గుర్తించారు. వీరికి పీఎంఈజీపీ ద్వారా రుణం మంజూరు చేయాలని బ్యాంకర్లకు, సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాల జారీచేశారు. అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు . కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ బేతోజు హరికృష్ణ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment