రూ.1,800 కోట్ల టర్నోవరే లక్ష్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) ముగిసేలోగా వచ్చే మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల టర్నోవరే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో గత నెల 30వ తేదీ నాటికి రూ.400 కోట్ల మేర డిపాజిట్లు సేకరించామన్నారు. ఇప్పటివరకు స్వల్పకాలిక రుణాల కింద రూ.670 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.170 కోట్ల తో పాటు ఆయా రైతులు, వినియోగదారులు ఏర్పా టు చేసుకునే వివిధ యూనిట్లకు రూ.286 కోట్ల రుణాలు అందజేశామన్నారు. ఆర్‌బీఐ అనుమతితో త్వరలోనే వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులో రానున్నా యని ఆయన వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, బ్యాంకు సీఈఓ పురుషోత్తంతో పాటు డైరెక్టర్లు, పీఏసీఎస్ ఎఫ్‌ఏసీఎస్‌ల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment