
తగ్గనున్న 9 ఎంపీటీసీ స్థానాలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల ఏర్పాటు
● 184 స్థానాల నుంచి 175 స్థానాలకు తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు
● ముసాయిదా విడుదల చేసిన జెడ్పీ అధికారులు
● 3న ఫైనల్ నోటిఫికేషన్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఎంపీటీసీ స్థానాల స్వరూపం మారనుంది. ఇప్పుడు 184 ఎంపీటీసీలు ఉండగా ఏకంగా 9 ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు, వాటి పరిధిలోని గ్రామాలతో రూపొందించిన ప్రతిపాదనలకు సంబంధించిన ముసాయిదాను జిల్లా పరిషత్ అధికారులు విడుదల చేశారు. కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల గండేడ్ మండలం నుంచి మహమ్మదాబాద్, దేవరకద్ర నుంచి కౌకుంట్ల మండలాలు ఏర్పడ్డాయి. దేవరకద్ర, మహబూబ్‌నగర్, నవాబ్‌పేట మండలాల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాల వివరాలతో ముసాయిదాను విడుదల చేశారు.
19 గ్రామ పంచాయతీలు విలీనం..
జిల్లాలో మొత్తం 441 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 19 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో, ఇతర మండలాల్లో విలీనం అయ్యాయి. మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి, జైనల్లిపూర్ గ్రామ పంచాయతీలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో విలీనం అయ్యాయి. దీంతో పాటు దేవరకద్ర ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. దేవరదక్ర, చౌదర్‌పల్లి, పెద్ద గోప్లాపూర్, బల్సుర్‌పల్లి, మినుగోనిపల్లి గ్రామాలను కలుపుకుని దేవరదక్ర మున్సిపాలిటీగా ఏర్పడింది. జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలంలో ఏకంగా 12 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలంలోకి వెళ్లాయి. ఇందులో మరికల్, అగ్రహారం, కిష్టాయ్యపల్లి, మల్కాపూర్, కొత్తపల్లి, కొత్తపల్లితండా, బొంగ్రాంపల్లి, లింగనపల్లి, పురుషంపల్లి, కంమన్‌పల్లి, చిన్నమేగ్యతండా, చాకల్‌పల్లి, నసీర్‌సాబ్‌తండా పంచాయతీలున్నాయి. ఈ 12 గ్రామపంచాయతీలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీలు తగ్గాయి. ఎంపీటీసీ స్థానాలు కూడా తగ్గనున్నాయి.
● జిల్లాలో ప్రస్తుతం 14 మండలాలు ఉన్నాయి. కొత్తగా గండేడ్ మండలంలోని మహమ్మదాబాద్, దేవరకద్రలో కౌకుంట్ల మండలాలు ఏర్పాడ్డాయి. మహమ్మదాబాద్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు, కౌకుంట్ల మండలంలో 12 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ సారి 16 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తగ్గనున్న 9 ఎంపీటీసీ స్థానాలు

తగ్గనున్న 9 ఎంపీటీసీ స్థానాలు
Comments
Please login to add a commentAdd a comment