వేర్వేరుగా తడి, పొడి చెత్త సేకరణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని సీడీఎంఏ కార్యాలయ సీడీఓ (కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీ సర్) హేమలత సూచించారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మి ది మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులకు మంగళవారం కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని డంపింగ్ యా ర్డులో శిక్షణఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా పట్టణాలలోని ఫంక్షన్ హాళ్లు, మార్కెట్ల తదితర ప్రాంతాల్లో వదిలేసే కూరగాయలు, ఇతర వ్యర్థ ఆహార పదార్థాల (తడి చెత్త) ను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. పెద్దమొత్తంలో డంపింగ్ యార్డుకు తరలించిన అనంతరం అక్కడ తడి చెత్త కుళ్లిపోయేందుకు ఇనాక్యులమ్ ద్రావణంవేసి ఎరువు (విండ్రో కంపోస్టు)గా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆటోల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు.మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, వజ్రకుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సీడీఎంఏ సీడీఓ హేమలత
9 మున్సిపాలటీల అధికారులకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment