కోయిల్‌సాగర్ నుంచి నీటి విడుదల
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగో తడికి నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగుకు ఇప్పటి వరకు మూడు తడులు నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం నాలుగో తడికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలారు. 9 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 22.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. నీటి విడుదలకు ముందు ప్రాజెక్టులో 31.6 అడుగులుగా నీటి మట్టం ఉండగా, ఇప్పటి వరకు 8.8 అడుగుల నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం వదిలిన నీటి విడత పూర్తి అయితే మరింత నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది.
విరామం ఇస్తూ నీటి విడుదల..
కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద యాసంగి సాగుకు విరామం ఇస్తూ తడులుగా నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25 నుంచి విడతల వారీగా నీటిని యాసంగి పంటలకు వదులుతున్నారు. ఇప్పటి వరకు మూడు తడులు పూర్తి కాగా, నాలుగో తడికి రెండు రోజుల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ప్రకటించిన షెడ్యూల్ కన్న రెండు రోజులు ముందుగానే నీటిని విడుదల చేశారు. తడి తరువాత చివరగా 5వ తడి కింద నీటిని విడుదల చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment