మాలలు ఉద్యమానికి సిద్ధం కావాలి
అలంపూర్: రాష్ట్రంలోని మాలలు భవిష్యత్ తరాల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మాలల భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాలలను అణగదొక్కి రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 ప్రకారం లోక్‌సభలో మెజార్టీ ఎంపీలతో వర్గీకరణ చేయాల్సి ఉందన్నారు.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్
అలంపూర్‌లో
మాలల సమావేశం
Comments
Please login to add a commentAdd a comment