బీసీలు సంఘటితం కావాలి
బిజినేపల్లి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీలంతా ఐక్యం కావాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంఘం సూర్యారావు పిలుపునిచ్చారు. మంగళవారం బిజినేపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ చైతన్య మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీసీలు సంఘటితం కావాలన్నారు. బీసీలు కమిటీల ద్వారా పటిష్టంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వెన్నుగా ఉండేలా కమిటీల నిర్మాణం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యమ నేత వట్టి జానయ్య యాదవ్, కుర్మయ్య, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌సాగర్, చంద్రశేఖర్, వెంకటేష్‌యాదవ్, వెంకట్‌స్వామి, రామన్‌గౌడు, అల్లోజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment