గుళికలు కొంటేనే యూరియా!
మహమ్మదాబాద్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటలకు అంతుచిక్కని తెగుళ్లతో పంటలను కాపాడుకోలేని దుస్థితి నెలకొనగా.. మరోవైపు ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్తే ఒకటి కొంటేనే మరొకరటి ఇస్తామని మెలిక పెట్టడం రైతులకు భారంగా మారుతోంది. మహమ్మదాబాద్ మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకుల తీరుతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రూ.500 పైగా విలువజేసే పిల్లగుళికలు కొంటేనే యూరియా ఇస్తామని షరతులు పెడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నంచర్లగేట్‌లోని ఎరువుల దుకాణానికి యూరియా కోసం వెళ్లిన ఓ రైతుకు ఈ పరిస్థితి ఎదురైంది. అయితే చేతిలో డబ్బు లేకపోవడంతో చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు.
నాసిరకం గుళికలు..
మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో నాసిరకం గుళికలు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వరిపైరుకు ఎన్ని గుళికలు చల్లినా మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గడం లేదని వాపోతున్నారు. ఈవిషయమై మండల వ్యవసాయాధికారి నరేందర్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకుల
తీరుతో రైతుల అవస్థలు
చెప్పింది కొనమంటున్నారు..
వరిచేను కలుపుతీసి యూరియా వేసేందుకు నంచర్ల గేట్‌లోని శ్రీలక్ష్మీ నర్సింహ ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లాను. దుకాణ యజమాని పిల్లగుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానని తెలిపాడు. యూరియాను కూడా రూ. 280కి విక్రయించాల్సి ఉండగా.. రూ.310 వసూలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ఎరువులు అమ్ముకుంటున్నారు.
– శ్రీనివాస్, రైతు, కొంరెడ్డిపల్లి
గుళికలు కొంటేనే యూరియా!
Comments
Please login to add a commentAdd a comment