పిచ్చి కుక్కల స్వైరవిహారం
కోస్గి: మూడు రోజలుగా పట్టణంలోని పలు కాలనీల్లో పిచ్చి కుక్కలు సంచరిస్తూ దాడులు చేయడంతో పలువురు స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఏకంగా రెండు పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నాపెద్ద తేడా లేకుండా ఏకంగా 22 మందిపై దాడి చేసి గాయపరిచాయి. వీరిలో చిన్నారులు, మహిళలు సైతం ఉన్నారు. మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనలు.. శుక్ర, శనివారం ఎస్సీ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియాల్లో పిచ్చి కుక్కలు ఉదయం నడక నుంచి వస్తున్న వారిపై దాడి చేయగా ఇద్దరికి కాళ్లకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం పట్టణంలోని ఎస్సీ కాలనీ, మామిళ్ల వీధి, బహర్‌పేట, ఆడికే వీధి, రామాలయం చౌరస్తాతో పాటు పలు చోట్ల రెండు పిచ్చి కుక్కలు పలువురిని గాయపరిచాయి. కొందరు యువకులు ఓ పిచ్చి కుక్కను వెంబడించి కొట్టి చంపగా.. మరోటి పరారైంది. గాయపడిన వారు ఒక్కొక్కరుగా స్థానిక ప్రభుత్వాస్పత్రికి క్యూ కట్టారు. కాలుపై కాటుతో తీవ్రంగా గాయపడటంతో మామిళ్ల నర్సమ్మతో పాటు మరో ముగ్గురిని పాలమూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో లింగంపల్లి కన్నప్ప, అనంతమ్మ, సాయమ్మ, నాగమణి, అనూశ్రీ, చెన్న బాలప్ప, శంకరమ్మ, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, అభిజ్ఞ, హన్మంతు, వెంకటమ్మ, బిచ్చమ్మ, సాయిచరణ్, ఆంజనేయులుతో పాటు పలువురు ఉన్నారు. కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
22 మందికి గాయాలు
బాధితులకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స
పిచ్చి కుక్కల స్వైరవిహారం
పిచ్చి కుక్కల స్వైరవిహారం
Comments
Please login to add a commentAdd a comment