ఆవేశంలో బైక్‌ను తగలబెట్టిన వ్యక్తి
తెలకపల్లి: ఆవేశంల ఓవ్యక్తి తన బైక్‌ను తానే తగలబెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోలగుండంకి చెందిన చందు సోమవారం మధ్యాహ్నం తెలకపల్లిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు తన బైక్‌కు నిప్పంటించాడు. తన తల్లి నిరంజనమ్మ పేరుమీద ఉన్న రూ.1.29లక్షల రుణం మాఫీ అయింది. ఇంకా రూ.13వేలు బ్యాంక్‌లో అప్పు ఉంది. అవి చెల్లిస్తే కొత్తరుణాలు కానీ, పాస్‌బుక్కులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. మళ్లీ రుణం కావాలని బ్యాంక్‌కు వచ్చినా ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంక్‌లోకి వెళ్లి అధికారులను పలకరించి చందు బ్యాంక్ నుంచి బయటకొచచ్చాడు. బ్యాంక్ బయటే బైక్‌కు పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో ఎవరూ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. బ్యాంక్ అధికారులనే మంటను ఆర్పినట్లు స్థానికులు తెలిపారు. ఇతని మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు చందును అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment