ఘనంగా ముగిసిన పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవాలయం ఆవరణలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు శ్రీరాజరాజేశ్వరి భజన మండలి (మహబూబ్‌నగర్), శ్రీరామాంజనేయ భజన మండలి (బొక్కలోనిపల్లి) బృందాలు భజనలు ఆలపించారు. పుట్టోజు చంద్రమౌళి బృందం అన్నమయ్య సంకీర్తనాలహరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్య మండలి కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. పద్య నాటక ప్రదర్శనల విజయవంతానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, సూపరింటెండెంట్ నిత్యానందం, శ్రీమిత్ర కళా నాట్య మండలి ఉపాధ్యక్షులు ఎన్.నర్సింలుతోపాటు భాస్కరాచారి, రాంచంద్రయ్య, కురుమూర్తి, ఆంజనేయులు, మాసన్న, పాండురంగాచారి, నారాయణ, రాము తదితరులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment