బల్మూర్: మండల కేంద్రంలో మంగళవారం పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొప్పెల్లి సాలమ్మ (50) సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగింది. గుర్తించిన ఇరుగు పొరుగు వారు వెంటనే చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.
ఉరేసుకొని వృద్ధురాలు..
వనపర్తి రూరల్: పట్టణంలోని పీర్లగుట్టకు చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాలు.. పీర్ల గుట్టకు చెందిన పల్ల సుబ్బమ్మ (58) పదేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఇటీవలే ఆమె ఊపిరితిత్తులు కూడా పాడైపోయాయి. మానసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంటి కిటికీకి చీరతో ఉరేసుకొంది. ఉదయం కుమారుడు వచ్చి చూడగా కిటికీకి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ మంగళవారం పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
హత్య చేయాలనే
కుట్రలో వ్యక్తి రిమాండ్
మహబూబ్‌నగర్ క్రైం: కుటుంబ కలహాల కారణంగా పథకం ప్రకారం కిరాణ దుకాణంలో ఉన్న వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగలపెట్టి పారిపోయిన వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని హాబీబ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ సమ్మద్, రామయ్యబౌళికి చెందిన షేక్ ఖలీద్ ఇద్దరూ బంధువులు. కొన్ని రోజుల నుంచి రెండు కుటుంబాల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరి 8న రాత్రి అబ్దుల్ సమ్మద్ కిరాణ దుకాణంలో ఉన్న సమయంలో షేక్ ఖలీద్ తనను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్‌తో అక్కడికి పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. అబ్దుల్ సమ్మద్‌తో పాటు దుకాణంపై ఆ పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు..షేక్ ఖలీద్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లో భాగంగా జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
ఇద్దరు పిల్లలతో కలిసి
తల్లి అదృశ్యం
కొత్తకోట రూరల్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆదృశ్యమైన ఘటన పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు పానుగంటి అలివేల, పెద్ద నాగయ్య కుమార్తె మరియను పదేళ్ల క్రితం వనపర్తి మండలంలోని అంజనగిరికి చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి చందు(8), మణి (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. రామకృష్ణ మూడు నెలల క్రితం మృతి చెందాడు. మరియ పిల్లలతో కలిసి తల్లి అలివేల వద్ద పామిరెడ్డిపల్లిలో ఉంటుంది. ఈనెల 13న మరియ ఇంటి నుంచి పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల దగ్గర వెతికినా సమాచారం లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మహిళపై దాడి: కేసు నమోదు
పాన్‌గల్: మహిళపై రాయితో దాడిచేసి గాయపర్చిన ఘటనపై మంగళవారం కేసు నమోదైనట్లు హెచ్‌సీ ప్రసాద్ తెలిపారు. వివరాలు.. మండలంలోని దావాత్‌ఖాన్‌పల్లికి చెందిన జంబులమ్మ మంగళవారం తన ఇంటి సమీపంలో కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన సహదేవుడు రా యితో మహిళపై దాడిచేశాడు. దీంతో మహిళకు కుడికాలు, మోకాలు కింది భాగంలో బలమైన రక్తగాయమైంది. గతంలో ఇదేవ్యక్తి బాధి త మహిళ ఇంటి తలుపులు తోసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనపై మహిళ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు సహదేవుడుపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment