నిరంతర సాధనతోనే విజయం
కొత్తకోట రూరల్: నిరంతర సాధనతోనే విజయం సిద్ధిస్తుందని, ప్రణాళిక, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య అన్నారు. మంగళవారం ఉద్యాన అధికారులుగా ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. గతేడాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యాన అధికారుల ఎంపిక పరీక్షలో కళాశాలకు చెందిన పదిమంది పూర్వ విద్యార్థులు ఉత్తీర్ణులై వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. మొత్తం 21 పోస్టుల్లో కళాశాలకు చెందిన పదిమంది ఉన్నారని.. ముగ్గురు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారులుగా బాధ్యతలు చేపట్టిన మహేశ్, వినాయక రుద్ర, శివతేజ, వెంకటరమణను ఆయనతో పాటు అధ్యాపకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా. షహనాజ్, డా. పూర్ణిమమిశ్రా, డా. శంకరస్వామి, డా. శ్రీనివాస్, నవ్య, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు
నిరంతర సాధనతోనే విజయం
Comments
Please login to add a commentAdd a comment