కనులపండువగా తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవం
అయిజ: మండల కేంద్రంలో వెలసిన తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం అర్థరాత్రి భక్తులు తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. రథాన్ని పూలమాలలు, మావిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాణసంచా కాల్పులతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా కుంభం కాగుతెచ్చి రథం చుట్టూ పొలిచల్లి స్వామివారి రథాన్ని కదిలించారు. పెద్ద ఆంజనేయస్వామి ఆలయంవరకు భక్తులు రథం లాగారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. రథోత్సవంలో యువత పలకల కోలాటం, కట్టెల కోలాటం ఆడారు. నందికోళ్ల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున రథంను యథాస్థానానికి చేర్చారు. రథోత్సవంకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
విద్యుత్ కాంతులతో ఆలయ ప్రాంగణం
మొక్కులు తీర్చుకున్న భక్తులు
అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు
కనులపండువగా తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment