సల్లంగా చూడమ్మ.. జములమ్మ
గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ప్రజల ఇంటి ఇలవేల్పుగా విరాజిల్లుతున్న జములమ్మ క్షేత్రం మంగళవారం భక్తజనసంద్రంగా మారింది. తెల్లవారుజామున 4.30 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లలో భక్తులు బారులుతీరారు. నడిగడ్డతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవారికి కోళ్లు, మేకపోతులు బలిచ్చి.. నైవేద్యాలు సమర్పించారు. సల్లంగా చూడమ్మ.. జములమ్మ తల్లి అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పాలకవర్గ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిక్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుశ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి గంటా కవిత, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందించారు.
సల్లంగా చూడమ్మ.. జములమ్మ
Comments
Please login to add a commentAdd a comment