రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
మహమ్మదాబాద్: రైతులను ఎవరైనా అనవసరమైన మందులు అంటగడుతూ ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి నరేందర్ అన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గులికలు కొంటేనే యూరియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. ఈ మేరకు ఆయన మండలంలోని నంచర్లగేట్, మహమ్మదాబాద్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి అమ్మకాలపై ఆరాతీశారు. అనుమతి లేకుండా అమ్ముతున్న ఎరువులు, పెస్టిసైడ్స్ దుకాణాల వివరాలను తెలుసుకున్నారు. నకిలీ ఎరువులు, గులికలు, రసాయనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంచర్లగేట్‌లోని శ్రీలక్ష్మీనర్సింహ ఫర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్ముతున్నందున మెమో జారీ చేశారు.
రామన్‌పాడులో
1,020 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని, ఎన్టీఆర్ కాల్వకు 31 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 155 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment