శాంతినగర్: ట్రాక్టర్‌ను మోటార్ సైకిల్ ఢీ కొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి మండలం జూలెకల్ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జూలెకల్ శివారులో ట్రాక్టర్‌లో డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ వెళ్లాడు. ఈ క్రమంలో శాంతినగర్ నుంచి అయిజ వైపు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి(50) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment