
మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి యాత్ర
దోమలపెంట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన శివమాలధారుడు 63 ఏళ్ల బాలనాగయ్య మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక అయ్యప్ప ఆలయంలో సేద తీరుతుండగా గ్రామస్తులు పలువురు ఆయనతో మాట్లాడగా వివరాలు వెల్లడించారు. నాలుగేళ్ల కిందట శివమాల ధరించి మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి బయలుదేరానని.. ఉమామహేశ్వరం కమాన్ వద్దకు చేరుకోగానే అస్వస్థతకు గురికావడంతో యాత్ర ముగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటంలో ఈ నెల 10న తిరిగి ఉమామహేశ్వరం కమాన్ నుంచి యాత్ర ప్రారంభించినట్లు వివరించారు. ఆయన వెంట ఇద్దరు కుమారులు, శివదీక్షలో ఉన్న మరో నలుగురు ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment