ఉదండాపూర్ గ్రామంలో తప్పనిసరిగా సర్వే చేసి అందులో అనర్హులుంటే ఏరి వేసి నిజమైన నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పుర పరిధిలోని పాతబజార్‌లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉదండాపూర్‌లో సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందని బీఆర్‌ఎస్ నాయకులే అడ్డుకుంటున్నారని విమర్శించారు. వల్లూరులో 1,005 మంది రైతులు ఉన్నట్లుగా రికార్డు ఉందని.. సర్వే చేపట్టగా అర్హులు కేవలం 574 మంది మాత్రమే ఉన్నట్లు తేలిందని వివరించారు. మిగిలిన వారంతా బీఆర్‌ఎస్ నాయకులు చేర్చిన బోగస్ లబ్ధిదారులన్నారు. అదేవిధంగా ఉదండాపూర్‌లోనూ సర్వే చేపడితే వారి బాగోతాలు బయటపడతాయనే భయంతో అడ్డుకుంటున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేపడతామని తెలిపారు. సర్వే జరిగితే అవార్డు పాసవుతుందని.. ఆరునెలల్లోగా పరిహారం చేతికందుతుందని వివరించారు. తను ఎమ్మెల్యే అయ్యాక తండావాసులకు రూ.41 కోట్లు విడుదల చేయించానని.. మరో రూ.71 కోట్లు కలెక్టర్ ఖాతాలో చేసినట్లు చెప్పారు. తనది రైతు పక్షపాతమని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లిందని, త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment