పోలేపల్లి ఎల్లమ్మ అంటే దశాబ్దాల నుంచి ప్రత్యేకత సంతరించుకుంది. జాతరలో ఇక్కడ అమ్మవారి షిడే ప్రత్యేకం. గతంలో జాతరలో సిడేకు ఒక జోగు మహిళను కట్టి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించేవారు. పదేళ్లుగా తోట్టెనె కట్టి అందులో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి ప్రదక్షిణ చేయిస్తున్నారు. ిషిడే, రథం ఏళ్ల కిందటి కావటంతో శిథిలావస్థకు చేరాయని భావించిన దాతలు రూ.10లక్షలతో అమ్మవారి సిడే , రూ.14 లక్షలతో రథాన్ని ఆలయానికి అందజేశారు. ఈ ఎడాది బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగిస్తున్నట్లు ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి తెలిపారు. 22వ తేదీన తేరు, 23న రథోత్సవం, 23న ప్రత్యేక పూజలు, 24న గ్రామంలో పల్లకీ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment