భక్తుల పాలిట కల్పవల్లి.. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి
కోస్గి: భక్తుల పాలిట కల్పవల్లిగా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బాసిల్లుతోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిశారు. రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ఆదరణ ఉన్నది పోలెపల్లి జాతర మాత్రమే. మినీ మేడారంగా ఈ జాతర ప్రసిద్ధికెక్కింది. గురువారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటుగా పొరు గు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు సూరత్, అహ్మదాబాద్ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, పాలకవర్గం సభ్యులు తెలిపారు. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి అన్ని శాఖలతో అధికారులతో సమావేశం నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు.
హెలీప్యాడ్ సిద్ధం
మిని మేడారంగా పేరొందిన పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు 21వ తేదీన జరిగే షిడే ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై అమ్మవారి దర్శింకుంటున్నారు. ఇప్పటికే రెండు వరుసల రోడ్లు పూర్తిచేశారు. సీఎం రాక కోసం హెలీప్యాడ్ సిద్ధం చేశారు.
ప్రత్యేక బస్సులు..
పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు భక్తులు ఆధిక సంఖ్యలో వస్తుండటంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా నారాయణపేట, కోస్గి, తాండూర్, పరిగి డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులకు దేవస్థాన కమిటీ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తుంది.
మినీ మేడారంగా పోలేపల్లి జాతర
స్వయంభూగా ఎల్లమ్మ అమ్మవారు
నేటి నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు
21న షిడేకు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి
అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీ
భక్తుల పాలిట కల్పవల్లి.. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి
Comments
Please login to add a commentAdd a comment