అతివేగానికి రెండు నిండు ప్రాణాలు బలి
తాడూరు: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు గేట్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి వివరాల మేరకు.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కు చెందిన అతినారపు శేఖర్ (31), శ్రీనివాసులు (42) బంధువులు. వీరిద్దరు హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో జరిగిన ఓ శుభకార్యంలో వారు పాల్గొని తిరిగి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయల్దేరారు. గుంతకోడూరు గేట్ సమీపంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి వీరి బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కనున్న మొక్కజొన్న పంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన తెలకపల్లి మండలం కార్వంగకు చెందిన రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు
ఇద్దరు యువకుల దుర్మరణం
తాడూరు మండలం గుంతకోడూరు గేట్ సమీపంలో ఘటన
అతివేగానికి రెండు నిండు ప్రాణాలు బలి
అతివేగానికి రెండు నిండు ప్రాణాలు బలి
Comments
Please login to add a commentAdd a comment