మిడ్జిల్: ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్న తమను సంప్రదించండి అంటూ సోషల్ మీడియా ప్రకటనలు వెల్లువలా కనిపిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కొందరు వీరిని నమ్మి మోసపోతుంటారు. ఇలాంటే సైబర్ మోసానికి గురైన ఘటన బుధవారం మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు తండ్రి జంగయ్య గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇన్‌స్టాలో హర్షసాయి ఐడీతో ఉన్న గ్రూప్‌లో సహాయం కావాలని ఆంజనేయులు కోరాడు. ఇది గమనించిన కేటుగాళ్లు హర్షసాయి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, రూ.4లక్షలు సహాయం చేస్తామని ఆంజనేయులును నమ్మించారు. డాక్యుమెంట్ చార్జి, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జి ఉంటాయని మీరు డబ్బులు పంపితే వెంటనే సహాయం అందుతుందని తెలిపారు. నిజమేనని నమ్మిన బాధితుడు ఆంజనేయులు వారిచ్చిన నంబర్లకు మంగళవారం సాయంత్రం ఫోన్‌పే ద్వారా ఐదు విడుతల్లో రూ.22,500 పంపించాడు. సహాయం కావాలని బాధితుడు పదేపదే ఫోన్ చేయగా బుధవారం ఉదయం కేటుగాళ్లు రూ.5,500 తిరిగి పంపించారు. తర్వాత వారు ఇచ్చిన ఫోన్ నంబర్లు స్విచాఫ్ అయ్యాయి. మోసపోయానని భావించిన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.
సైబర్ కేటుగాళ్ల వలకుచిక్కుకున్న బాధితుడు
పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment