మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాశ్ మృతి
స్టేషన్ మహబూబ్‌న గర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ మా జీ చైర్మన్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ము త్యాల ప్రకాశ్ (77) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన పలు పదవులను అధిరోహించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రకాశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. మహబూబ్‌నగర్ సూపర్‌బజార్ చైర్మన్, రీజినల్ ఫిలిం సెన్సార్ బోర్డుమెంబర్‌గా, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడిగా పని చేశారు. 1999–2004 వరకు మున్సిపల్ చైర్మన్‌గా, 2005–2012 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2012లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చే రారు. ఆయన ప్రకాశ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడులో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా, స మాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపే శారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎమడ కాల్వల ద్వారా 130 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment