నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన, ఎవరూ అడగకపోయినా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశానని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. గత పాలనలో రూపాయి ఇవ్వకున్నా మభ్యపెట్టి మోసం చేశారని తాను అలా కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను నిర్వాసితుల తరఫున పాదయాత్ర చేసి పోరాడినట్లు గుర్తు చేశారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకొచ్చి సమస్యలను వివరించామని, అవార్డు పాస్ అయిన తండాలకు రూ.42 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలలో జమ చేశామన్నారు. మరో రూ.71 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అవార్డు పాస్ అయిన ఆరు మాసాలలో పరిహారాన్ని అందజేస్తామన్నారు. అదనంగా రూ.170కోట్లు పరిహా రం ఇస్తే నిర్వాసితులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. అసలు రిజర్వాయర్ లోకిరేవు దగ్గర రావాల్సి ఉందని, కానీ రాజకీయ పలుకుబడితో దానిని ఉదండాపూర్‌కు మారిస్తే ఎందుకు ప్రశ్నించ లేదన్నారు.
ఇటీవల తన సహచర ఎమ్మెల్యేలతో సమావేశమైంది కూడా నిర్వాసితులకు న్యాయం చేసేందుకే అని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పార్టీని, పదవిని త్యాగం చేసి పోరాడతానన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కర్వెన రిజర్వాయర్ వరకే పనులను పరిమితం చేద్దామని ప్రభుత్వం భావించిందని, తన పట్టుదల వలనే పనులు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. సీఎం రేంవత్‌రెడ్డి తమకు అనుకూలంగా ఉన్నారని, న్యాయపరమైన సమస్యలు రాకుండా పరిహారం పెంపునకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment