మహాప్రభో.. పరిహారం పెంచండి
జడ్చర్ల: ‘పచ్చని పంటలు పండే భూములు త్యాగం చేశాం. తాత ముత్తాల కాలం నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను సైతం వీడి ఊళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వమే తమ త్యాగాలకు సరైన గుర్తింపునివ్వడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు కేవలం రూ.5.50 లక్షల నుంచి రూ.6.50 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. కనీసంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీనైనా పెంచి తమకు న్యాయం చేయాలని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు మొర పెట్టుకున్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో నిర్వాసితుల సమస్యలపై బహిరంగసభను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్‌కుమార్, సబ్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నర్సింగరావు, తదితరులు సభకు హాజరయ్యారు. ఒక్కొక్కరుగా నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ భూములకు ఇచ్చిన పరిహారం ఫలహారానికి కూడా చాలలేదని, బయటి మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలిస్తే తమకు అందింది నామమాత్రమే అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని, 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలో ప్రైవేట్ భూములలో ప్లాట్లు కొనుగోలు చేసి కట్టుకున్న వారికి కూడా పరిహారం అందించాలని, గ్రామ కంఠం వరకే ఉన్న నిబంధనలు తొలగించాలని కోరారు.
గ్రామ బహిరంగసభలోఉదండాపూర్ నిర్వాసితుల మొర
బాధితులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
అవసరమైతే పదవీ త్యాగానికై నా సిద్ధం
దీక్ష విరమించేందుకు నిర్వాసితుల ససేమిరా
Comments
Please login to add a commentAdd a comment