చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
పాలమూరు: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి అనేది శిక్ష పడే నేరాలు అని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిపై ఎన్‌ఏఎస్‌సీ ఏర్పాటు చేసిన పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులు, మహిళలు, పిల్లలు మానవ అక్రమ రవాణా చేస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 143(2నుంచి 6) వరకు, అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం సెక్షన్ 3 నుంచి 9 ప్రకారం శిక్ష అర్హులని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
శాంతివనాన్ని సందర్శించిన న్యాయమూర్తి
జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉన్న శాంతివనం అనాథ శరణాలయాన్ని న్యాయమూర్తి డి.ఇందిర సందర్శించారు. శాంతివనంలో పిల్లలకు అందుతున్న భోజన వసతి, నీరు సదుపాయం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మానసిక వికలాంగులైన విద్యార్థులతో న్యాయమూర్తి ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం నల్లా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్‌తో పాటు బాలల సంరక్షణ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment