ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రతి పాఠశాలలో మౌలిక వసతలు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికై న పాఠశాలల్లో మరమ్మతులు చేయడం, రంగులు వేయడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టిన వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.1.30కోట్ల చెక్కులను పాఠశాలల కమిటీ చైర్మన్‌లకు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో చాలా పాఠశాలల్లో పనులను చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలను సందర్శించినప్పుడు అ క్కడ ఉన్న అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని అన్నారు. అత్యవసరమైన వాటికి విద్యా నిధి నుంచి, ఎస్టీఎఫ్ నిధులను ఉపయోగించి పరి ష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో చదివే విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టంకర, కొత్త పేట పాఠశాలల్లో ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు డబుల్ డెస్క్ బెంచీలు అందించామని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ప్ర భుత్వ పాఠశాలల ఆస్తుల రక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూ చించారు. త్వరలో ప్రతి పాఠశాలలో సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్‌యాదవ్, మాధవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాంచంద్ర య్య, తులసిరామ్‌నాయక్, సిరిగిరి మురళీధర్, ఆంజనేయులు, ప్రతాప్‌రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment