వలస వెళ్లిన వారికి పరిహారం ఇవ్వాలి
బతుకు దెరువు కోసం కొందరు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారికి సంబంధించి రేషన్, ఓటర్, ఆధార్ కార్డులు ఉదండాపూర్‌లోనే ఉన్నాయి. వారందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తించేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మొదటి సర్వే అనంతరం పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడ బిడ్డలకు సైతం ప్యాకేజీ ఇవ్వాలి. అనర్హులను గుర్తించి అర్హులకు న్యాయం చేయాలి.
– శివకుమార్, నిర్వాసితుడు, ఉదండాపూర్
న్యాయం చేయాలి
అర్హత కలిగిన నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని కొందరు అక్రమంగా దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. 132 సర్వే నంబర్‌లో భూ పరిహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయి. రీసర్వే చేసి అసలైన నిర్వాసితులకు న్యాయం చేయాలి.
– బ్రహ్మం, నిర్వాసితుడు
ఇప్పటికే ఆలస్యమైంది..
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని పెంచి త్వరగా అందజేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి బయటి మార్కెట్‌లో ధరలకు వ్యత్యాసం తీవ్రంగా ఉంది. భూ పరిహారం ఫలాహారంగా అయిపోయింది. ప్యాకేజీతో పాటు మా ఇళ్లు, ఖాళీ స్థలాల పరిహారాన్ని ఒకేసారి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి.
– వడ్ల సత్యనారాయణ చారి, నిర్వాసితుడు
●
వలస వెళ్లిన వారికి పరిహారం ఇవ్వాలి
వలస వెళ్లిన వారికి పరిహారం ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment