రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
మహబూబ్‌నగర్ క్రైం: పట్టణంలోని శ్రీనివాసకాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న అరేబియాన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్‌లోని రెండో అంతస్తు ఫ్యామిలీ సెక్షన్‌లో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుర్చీలకు మంటలు వ్యాపించి దట్టమైన పొగ రావడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పాటు ఐదుగురు సిబ్బందిని నిచ్చెన ద్వారా సురక్షితంగా కిందకు దించారు. రెస్టారెంట్ ప్రధాన రహదారిపై ఉండటంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కిషోర్ మాట్లాడుతూ.. కుర్చీలకు రెగ్జీన్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని, ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని తెలిపారు. ఈ ప్రమాదంతో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు.
ఐదుగురు సిబ్బందిని రక్షించిన
అగ్నిమాపక సిబ్బంది
రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment