ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
కఠిన చర్యలు తప్పవు
మండలంలో ఎక్కడైనా కృత్రిమంగా ఇసుకను తయారు చేస్తున్నా అక్రమంగా ఇసుకను తరలించినా కఠినచర్యలు తప్పవు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గ్రామాల శివారుల్లోని రైతులు, గ్రామస్తులు సైతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం ఉంటే తమకు తెలపాలి.
– శివానందం, ఎస్‌ఐ రాజాపూర్
ఇసుక డంప్‌లను
సీజ్ చేస్తున్నాం
ఇసుక రవాణా జరుగుతున్నదని తమ దృష్టికి వస్తే వెంటనే దాడులు చేసి ఇసుక డంప్‌లను సీజ్ చేస్తున్నాం. పట్టుబడిన వాహనాల స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. దుందుభీ వాగులో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నట్లు సమాచారం రాగానే వెళ్లి ఇసుక ఫిల్టర్‌ను ధ్వంసం చేశాం.
– విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దార్, రాజాపూర్
రాజాపూర్: ఇసుక మాఫియాపై రెవెన్యూ, పోలీసు శాఖలు ఉక్కుపాదం మోపాయి. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని కుచ్చర్‌కల్ గ్రామ శివారులో దుందుభీ వాగులో కాంక్రీట్‌తో ఏర్పాటుచేసిన ఇసుక ఫిల్టర్‌ను అధికారులు ధ్వంసం చేశారు. రాజాపూర్ పరిసర ప్రాంతాల జేసీబీలను అధికారులు పిలిచినా రాకపోవడంతో హైదరాబాద్ నుంచి ఇటాచీ తెప్పించి అక్కడున్న ఫిల్టర్ ధ్వంసం చేశారు. వాగులోకి కిలోమీటర్‌కు పైగా దూరం వరకు తయారుచేసిన కృత్రిమ ఇసుకను తయారుచేస్తారు. వీటిని తరలించేందుకు వీలుగా ఇసుక మాఫియా వాగులో రోడ్డు వేసుకున్నది. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందడంతో వారి వాహనాలు రాకుండా ఉండేందుకు రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద మట్టికుప్పలను అడ్డుగా పోశారు. అయితే అధికారులు తెచ్చిన ఇటాచీతో పెద్దపెద్ద మట్టికుప్పలను తొలగించి ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్, బాలానగర్ ఎస్‌ఐలు శివానందం, లెనిన్, రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో ఫిల్టర్‌ను ధ్వంసం చేయించారు. ఫిల్టర్లకు వాడుతున్న జనరేటర్లు, మోటార్లను సీజ్‌చేసి రాజాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతుల్లేకుండా అక్రమంగా విద్యుత్‌ను వాడుతుండటంతో విద్యుత్ శాఖాధికారులు కరెంట్ కనెక్షన్‌ను తొలగించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండానే ఇంటిని సైతం నిర్మించారు.
కుచచర్‌కల్ శివారులో ఇసుక ఫిల్టర్ ధ్వంసం
వాగులో కిలోమీటర్ మేర కృత్రిమ ఇసుక
తరలించేందుకు రోడ్డు వేసిన మాఫియా
అధికారుల రాకను అడ్డుకునేందుకు రోడ్డుపై మట్టికుప్పలు
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
Comments
Please login to add a commentAdd a comment