ఆహార పంటలకు మోతాదులోనే ఎరువులు
బిజినేపల్లి: యాసంగిలో ఆహార పంటలను సాగు చేసే రైతులు రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగించకూడదని పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని మంగనూర్ శివారులో యాసంగి ఆహార పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డా.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆహార ధాన్యం పంటలు సాగు చేసే రైతులు ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులను వినియోగించడం వలన ఆహారం విషతుల్య అవుందన్నారు. ప్రస్తుత యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న, వరి వంటి పంటలను ఎక్కువగా సాగు చేశారని, వాణిజ్య పంటల సాగు తక్కువ విస్తీర్ణంలో చేపట్టారన్నారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్, రైతులు పరశురాములు, కొండన్న తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment