కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్ర ప్రభుత్వ అమలుచేస్తున్న పథకాలను అధికారులు, బ్యాంకర్లు ప్రోత్సహించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అధికారులకు ఆదేశించారు. బుధవారం స్థానిక జెడ్పీ హాలులో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాల అభివృద్దే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సబ్సిడీతో కూడుకున్న అన్ని పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ 18 కుల, చేతివృత్తులకు విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించడంలో జిల్లా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంతో విశ్వకర్మ పథకం లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని, అనుమానాలను నివృత్తి చేయడం సంతోషకరమన్నారు. విశ్వకర్మపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలు ఎదగాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, ఎంఎస్‌ఎంఈ అధికారి శ్రీనివాస్‌రావు, ఎల్‌డీఎం భాస్కర్, వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వీటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి
బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి: ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment