సప్లయర్ ఇంట్లో అంగన్‌వాడీ సరుకులు
జడ్చర్ల టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సరుకులు సప్లయర్ ఇంట్లో నిల్వ ఉండటంతో జడ్చర్ల సీడీపీఓ శోభారాణి సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. అంగన్‌వాడీ కేంద్రాలకు బాలామృతం, పప్పు, నూనెలను జడ్చర్ల వెంకటేశ్వరకాలనీకి చెందిన కృష్ణారెడ్డి సరఫరా చేసే సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రతి సరుకు గోదాం నుంచి మాత్రమే కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అలాంటిది అతడి ఇంట్లో అక్రమంగా సరుకులు నిల్వ ఉన్నాయని ఆదివారం రాత్రి అంగన్‌వాడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అదేరోజు రాత్రి ఆప్రాంత అంగన్‌వాడీ టీచర్, సూపర్‌వైజర్లు వెళ్లి పరిశీలించగా 111 కిలోల బాలామృతం 80కిలోల కందిపప్పు, 8లీటర్ల వంటనూనెలు ఉండటాన్ని గుర్తించి సీడీపీఓకు సమాచారమిచ్చారు. సోమవారం ఉదయం సీడీపీఓ శోభారాణి, ఆర్‌ఐ హర్షవర్దన్‌రెడ్డిలతోపాటు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేసి సరుకులను ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించారు. గోడౌన్‌లో ఉండాల్సిన సరుకు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని సప్లయర్‌ను ప్రశ్నించగా కేంద్రాలకు సప్లయ్ చేయగా మిగిలినది ఇక్కడ నిల్వచేసినట్లు చెప్పుకొచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన సీడీపీఓ
Comments
Please login to add a commentAdd a comment