స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీ సంఘాల పోరాటాల ఫలితమే బీసీ బిల్లు అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం అమలుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టి ఆమోదించడంలో బీసీ సంఘాల పోరాటాల ఫలితంగానే సాధ్యమైందన్నారు. ఆయా కుల, బీసీ సంఘాల ప్రతినిధులు బుగ్గన్న, అశ్విని సత్యం, ఆశన్న ముదిరాజ్, విశ్వనాథ్, కేశవులు, ఆంజనేయులు, సుకుమార్, వీరప్ప, భీమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.