ప్రతినెల 20 నుంచి 30వ తేదీలోపు స్టాక్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు బియ్యం చేరుకోవాలి. ఆ తర్వాత 1వ తేదీ నుంచి నుంచి 17వ తేదీ వరకు రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తాం. అయితే ఈనెల 19వ తేదీ వచ్చినా ఇంతవరకు మా రేషన్‌షాపునకు బియ్యం సరఫరా చేయలేదు. జనం బియ్యం కోసం ప్రతిరోజూ వచ్చి పోతున్నారు. నేడో.. రేపో బియ్యం వస్తే అధికారులు 22 లేదా 25 పంపిణీ చివరి తేదీ అంటారు. బియ్యం సరఫరా నిలిపివేస్తారు. ఇలా ఎన్నోమార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బియ్యం పంపిణీకి 30వ తేదీ వరకు సమయం ఇవ్వాలి.
– మోహన్‌నాయక్, రేషన్ డీలర్, అన్నారెడ్డిపల్లి తండా, మహమ్మదాబాద్ మండలం
ఒకటి, రెండు రోజుల్లో...
పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌బియ్యం సరఫరాలో కొంత ఆలస్యం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం పంపేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు 3,900 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా పూర్తయింది. ఈనెల 25వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తాం. – తోట వెంకటేష్,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
●
నేటికీ బియ్యం ఇవ్వలేదు..