మరికల్: పాము కాటుకు మహిళ మృతిచెందిన ఘటన శనివారం గాజులయ్యతండాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గాజులయ్యతండాకు చెందిన డేగవత్ లక్ష్మి పొయ్యి కట్టెల కోసం పొలానికి వెళ్లింది. కట్టెలు కొడుతుండగా ముళ్లపొదలో ఉన్న పాము కాటేసింది. ఆమె ఆజాగ్రత కారణంగా కొద్ది సమయానికి నోట్లో నుంచి నురుగులు వచ్చి అక్కడిక్కడే మృతిచెందింది. సాయంత్రం గమనించిన చుట్టుపక్కల రైతులు ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దిక్కుముక్కు లేని ఈ కుటుంబంలో తల్లి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్తులు చందాలు వసూలుచేసి అంత్యక్రియలు నిర్వహించారు.
భవనంపై నుంచి
కిందపడి కార్మికుడు మృతి
మహబూబ్‌నగర్ క్రైం: నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి ఓ కార్మి కుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గాజులపేటకు చెందిన రమేష్(42) జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న రెండవ అంతస్తు భవనంలో శుక్రవారం సెంట్రింగ్ బాక్స్ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొంత సేపు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకడి బలవన్మరణం
కోడేరు: ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘ టన నాగర్‌కర్నూల్ జి ల్లా కోడేరు మండల కేంద్రంలో చోటు చే సుకున్నట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మహే్ ష (30)కు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామశివారులో ఓ చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబీకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పుష్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
సంపులో పడి
మహిళ మృతి
కల్వకుర్తి టౌన్: ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న సంపులో పడి ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సుభాష్‌నగర్ కాలనీకి చెందిన బాలకిష్టమ్మ(49) తన కొడుకుతో కలిసి నిర్మల విద్యాలయం దగ్గర నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జారి నీటి సంపులో పడింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బయటకు తీశారు. ఆమె అప్పటికే మృతిచెందింది.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
ఆత్మకూర్: మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన దండు రవి అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రవిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వనపర్తి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు.
పాము కాటుకు మహిళ బలి
పాము కాటుకు మహిళ బలి