
గ్రామాల్లో శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: గ్రామ గ్రామన శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు భోజనపల్లి నరసింహమూర్తి అన్నారు. జిల్లాకేంద్రం తెలంగాణ చౌరస్తాలోని శ్రీగణేష్ భవనంలో ఆదివారం జిల్లా వీహెచ్‌పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు ఈ ఏడాది ప్రత్యేకంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ కమిటీ ఉన్న ప్రతి చోట, నగరాలు, బస్తీల్లో ఈ రామోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త దేవాలయాలను కేంద్రంగా చేసుకొని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పరిషత్‌ను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, దుర్గావాహిని మాతృమండలి కార్యకర్తలకు ఏప్రిల్, మే మాసంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ జిల్లా నూతన కార్యదర్శిగా నాగరాజును, అంతకుముందు కార్యదర్శిగా ఉన్న నలిగేశి లక్ష్మీనారాయణను విభాగ్ సహ కార్యదర్శిగా ప్రకటించారు.