మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలను దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అత్యధిక మంది బాలికలు చదవడం గొప్ప విషయమని, ఈ కళాశాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇక్కడ చదివే 500 మంది బాలికలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి శిక్షణలు ఇస్తామన్నారు. శిక్షణ కోసం వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని, మొదటి బ్యాచ్‌ను పైలెట్ బ్యాచ్‌గా ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వాలని ఫౌండేషన్ సభ్యులను కోరారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో రాణించాలంటే విద్యార్థులు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్‌ముత్యాల, శేఖర్, మురళీమోహన్, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.