మాకు మీరు.. మీకు మేము !
‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు
● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా
● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం
● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం
● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే..
‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు..
ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి.