
సహాయక చర్యలు వేగవంతం..
సొరంగంలో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. సోమవారం జేపీ కంపెనీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, ిహైడ్రా అధికారి సుదర్శన్‌రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేటిచంద్రం, జేపీ కంపెనీ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్షించారు. సహాయక బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా 24 గంటలు శ్రమిస్తున్నారని చెప్పారు. సహాయక బృందాలు, నిపుణులు సమన్వయంతో పనిచేస్తున్నారని.. మైనింగ్ ప్రమాదాల్లో నిష్టాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నామని వివరించారు. సహాయక సిబ్బందికి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.