
ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం బాబు జగ్జీవన్‌రాం జయంతి, ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ విషయమై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయా సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశమై చర్చించారు. గతేడాది కన్నా ఈసారి మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం సమావేశానికి హాజరైన పలువురు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రాం, అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణతోపాటు ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ తదితర సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అంబేడ్కర్ కళాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేయాలని, బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద మెట్లు నిర్మించాలని కోరారు. సమావేశంలో జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.