
తప్పని దూరభారం..
జిల్లాలో 17 మండలాలు ఉండగా.. అందులో అన్ని కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్న మండలాలు ఉన్నాయి. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్‌స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. గండేడ్, మహమ్మదాబాద్, కోయిలకొండ మండలాల పరిధిలోని గ్రామాలకు మహబూబ్‌నగర్ నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలో చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు వసతి కూడా లేకపోవడంతో ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. జిల్లాలో మొత్తం 441 గ్రామాలు ఉండగా.. కేవలం నాలుగు వాహనాలే అందుబాటులో ఉన్నాయి.
నీటికి కొరత లేదు..
జిల్లాకు ఇటీవల 90 వేల లీటర్ల ఫైర్ ఇంజిన్ మంజూరు కావడంతో పాటు ఎమ్మెల్యే నిధుల సహకారంతో ఫైర్ స్టేషన్‌లో బోరు వేయడం వల్ల ఫైర్ ఇంజిన్‌లలో నీటిని నింపుకోవడానికి కొరత లేదు. మూడు ఫైర్ ఇంజిన్లు, ఒక మిస్ట్ జీపు, ఒక బుల్లెట్ అందుబాటులో ఉంది. జడ్చర్లలో ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉంది. అన్ని అడ్వాన్స్ వాహనాలు కావడం వల్ల మల్టీపర్పస్‌కు ఉపయోగించవచ్చు. ఇటీవల చిన్న ప్రమాదాల సంఖ్య పెరిగాయి. చిన్న వాటికి బుల్లెట్, మిస్ట్ జిప్‌లు వాడుతున్నాం. వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరు అత్యవసరమైతే తప్ప సెలవు తీసుకోకుండా పనిచేస్తాం. జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజిన్స్‌తో బాధ్యతగా పనిచేసి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తాం. ప్రస్తుతం వేసవి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. ముఖ్యంగా బహుళ అంతస్తులు ఉన్న పట్టణాలపై దృష్టిపెడతాం. అలాగే పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై నిఘా ఏర్పాటు చేస్తాం.
– కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
●