
హెచ్‌సీయూ భూముల వేలం దారుణం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన హెచ్‌సీయూలో భూములను ప్రభుత్వం లాక్కోవడం దారుణమైన విషయమన్నారు. 1,800 ఎకరాల భూమి వందలాది రకాల పక్షులు, జంతువులకు నివాసంగా ఉందని, చెరువులు, ఇతర జీవజాతులు ఉన్నాయని, అలాంటి భూములను ప్రభుత్వం అమ్మడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య భవిష్యత్‌లో విద్యను అంధకారం చేయడం ఖాయమన్నారు. వెంటనే ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, విష్ణు, సతీష్, రవికుమార్, వేణు, నందిని తదితరులు పాల్గొన్నారు.