
పీయూ సిబ్బందికి ఈపీఎఫ్ సదుపాయం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ సిబ్బందికి గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ సదుపాయం లేకపోవడంతో వీసీ శ్రీనివాస్ చొరవతో ఈపీఎఫ్ సదుపాయాన్ని కల్పిస్తూ ఇటీవలి జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ నాన్‌టీచింగ్ సంఘం నాయకులు వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా లేని ఈపీఎఫ్ సదుపాయాన్ని వీసీ చొరవ తీసుకుని కల్పించడం గొప్ప విషయమన్నారు. సిబ్బంది అనారోగ్యం పాలైతే రూ.లక్షల్లో ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారని, ఈ సదుపాయం కల్పించడం వల్ల ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు సైతం గత కొన్నేళ్లుగా పెంపుదల లేదని, వాటిని త్వరలోనే పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు.