
జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
మహబూబ్‌నగర్ రూరల్: కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆరు దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్నా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎంని చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీసీ జాగృతి సేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్, నాయకులు తిరుమలేష్, అంజిలప్ప, రవి, తిమ్మయ్య పాల్గొన్నారు.
బీసీ జాగృతిసేన
రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్