
కొత్త పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈలు సహకరిస్తాయి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కొత్త పరిశ్రమలకు ఎంస్‌ఎంఈ(మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)లు ఎంతో సహకరిస్తాయని పీయూ రిజిస్త్రార్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఆర్థికవృద్ధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ పాత్ర అవకాశాలు మరియు సవాళ్లు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక్కరోజు జాతీయ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈలు ఉపాధి కేంద్రాలుగా వ్యవహరించొవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుపై విద్యార్థి దశ నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగం కోసం వేచి చూడకుండా ఎంస్‌ఎంఈలలో ఒక పరిశ్రమను స్థాపించడంతో పలువురకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకుడు కేశవరెడ్డి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనర్ సుధీర్, మంజూల, కల్వకోల్ భాస్కర్, నాగరాజు, వినోద్‌కుమార్, ఆరీఫ్ పాల్గొన్నారు.
బంగారు దుకాణంలో చోరీ
కొత్తకోట రూరల్: పట్టణంలోని హనుమాన్ జ్యువెలరీ దుకాణంలో మహిళలు చోరీకి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. దుకాణ యజమాని మధ్యాహ్న భోజనానికి వెళ్లగా అందులో పనిచేసే అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. దీనిని గమనించిన ఐదుగురు మహిళలు దుకాణంలోకి వచ్చి బంగారు వస్తువులు చూపాలంటూ మాటల్లో పెట్టగా.. అందులో ఓ యువతి బంగారు బిస్కెట్‌ను దొంగిలించింది. యజమాని వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి వచ్చి బిస్కెట్ కావాలని అడగగా కనిపించకపోవడంతో అవాకై ్క వెంటనే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. వచ్చిన వారిలో ఓ యువతి బంగారు బిస్కెట్ దొంగిలించిందని నిర్ధారించుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిస్కెట్ 6 తులాల బరువు ఉంటుందని, దాని విలువ సుమారు రూ.5 లక్షలని యజమాని వివరించారు.
పీయూ రిజిస్త్రార్ మధుసూదన్‌రెడ్డి