
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
● టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తప్పదని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు రావల్సిన బిల్లులు అందక ఉద్యోగులు ఆయోమయంలో ఉన్నారన్నారు. తమ జీతం డబ్బు నుంచి నెలనెల దాచుకున్న జీపీఎఫ్ అకౌంట్ నుంచి తమ అవసరం కోసం లోన్ రూపంలో దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా బిల్లులు పాస్ కాకపోవడం భాదాకరమన్నారు. మెడికల్ బిల్స్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శ చంద్రనాయక్, జిల్లా కోశాధికారి కృష్ణమోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.