
భరోసా లేదు.. రుణమాఫీ కాలేదు
ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు నేటికీ బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. మా గ్రామంలో సొంతంగా ఎకరా భూమి ఉంది. అందులో వరి పంట వేసిన. ఇంతవరకు రైతు భరోసా పడలేదు.. రుణమాఫీ కూడా కాలేదు. రైతు భరోసా ఎప్పుడు పడుతుందోనని బ్యాంకు చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుడు అవుతుంది. నా లాంటి రైతులకు భరోసా డబ్బులు జమ చేస్తే కోతలకు పనికి వస్తాయి.
– హరిజన ఆశన్న, రైతు, కోడూర్, మహబూబ్‌నగర్ రూరల్
రైతులందరికీ పెట్టుబడి సాయం
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు భరోసాను రైతుల బ్యాంకు ఖాతాల్లో అవుతున్నాయి. ప్రభుత్వం యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 1.88,905 మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.160.81 కోట్లు జమ చేసింది. మిగిలిన రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం త్వరలో అందుతుంది.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

భరోసా లేదు.. రుణమాఫీ కాలేదు