
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నచింతకుంట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం వండించి భోజనం చేశారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీ లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, నాయకులుు నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పశాంత్‌కుమార్, కథలప్ప, సురేందర్‌రెడ్డి, వట్టెం శివ, రవికుమార్‌గౌడ్ ఉన్నారు.
రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఏర్పడిన ఆరు రేషన్ డీలర్ భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు 18–40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ పని దినాలలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం చూస్తే హన్వాడ మండలం గొండ్యాల–2 బీసీ–ఈ, చిన్నదర్పల్లి బీసీ–ఈ, కౌకుంట్ల మండలం అప్పంపల్లి బీసీ, మహబూబ్‌నగర్ అర్బన్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ ఓసీ, మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఫతేపూర్‌ఎస్టీ, మిడ్జిల్ మండలం సింగందొడ్డి ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇప్పటి వరకు ఉగాది, రంజాన్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందని, రాబోయో అన్ని మతాల పండుగలను అదే పద్ధతిలో జరుపుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో అన్ని మతాల పెద్దలతో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మతాల మధ్యన స్నేహాభావం పెంపొందించి శాంతి భద్రతలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సంఘంలో సమగ్ర అభివృద్ధికి శాంతి అవసరమని, పోలీస్‌శాఖ ఎప్పుడూ ప్రజల కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య పాల్గొన్నారు.
ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని మూసాపేట మండలంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం నాయకుడు ఘన్సిరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్‌జీఓ, టీజీఓ, తహసీల్దార్ల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మూసాపేట తహసీల్దార్ రాజునాయక్, కార్యాలయంలో విధులు నిర్వహిస్తు న్న రికార్డ్ అసిస్టెంట్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా నాయకుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు జరిగితే విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోని తొలగించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, చైతన్య, సుదర్శన్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం